ట్రాఫిక్ పేరు చెబితేనే కోల్ కతా, బెంగళూరు, పూణె వాసులు హడలిపోతున్నారు. గంటలకు గంటలు ట్రాఫిక్ లోనే వారి టైం గడిచిపోతోంది. అవును ప్రపంచంలోనే అతి ఎక్కువ రద్దీ కలిగిన నగరాల జాబితాలో కొలంబియాలోని నగరం బారన్ క్విల్లా మొదటి స్థానంలో ఉండగా.. రెండో స్థానంలో కోల్ కతా, మూడో స్థానంలో బెంగళూరు , నాల్గో స్థానంలో పూణె , ఐదో స్థానంలో లండన్ ఉంది. తర్వాత క్యోటో, జపాన్ , దావో సిటీ, ఫిలిప్పీన్స్ మొదటి 10 స్థానాల్లో ఉన్నాయి.
డచ్‌కు చెందిన లొకేషన్ టెక్నాలజీ స్పెషలిస్ట్ టామ్‌టామ్.. ట్రాఫిక్ ఇండెక్స్ 2024 పేరుతో ఓ స్టడీ చేసింది. వాహనాల రద్దీ వల్ల టైం వృథా, ఖర్చుతోపాటు కర్బన ఉద్గారాల ప్రభావాన్ని పరిశీలించింది. ప్రపంచవ్యాప్తంగా 62 దేశాల్లోని500 నగరాల్లో ఈ స్టడీ చేసింది.
ALSO READ | ప్రమాదం జరిగిన వెనక్కి తగ్గలే: దుబాయ్ కార్ రేసింగ్‌లో మూడోస్థానంలో అజిత్ టీమ్
నంబర్ వన్ స్థానంలో ఉన్న బారన్ క్విల్లాలో 10 కి.మీ జర్నీకి 36 నిమిషాల 6 సెకన్లు పడుతుందదంట. కోల్ కతాలో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే సగటున 34 నిమిషాల 33 సెకన్లు, బెంగళూరులో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాలంటే సగటున 34 నిమిషాల 10 సెకన్లు, పూణెలో 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు 33 నిమిషాల 22 సెకన్లు పడుతుందంట. లండన్ లో 10 కిలీమీటర్ల ప్రయాణానికి సగటున 33 నిమిషాల 17 సెకన్లు పడుతోందంట. దీంతో వాహనదారులకు నరకం కనిపిస్తోంది.