కస్టం మిల్లింగ్ ​వడ్లు మాయం..అదనపు కలెక్టర్​​పై కేసు

కస్టం మిల్లింగ్ ​వడ్లు మాయం..అదనపు కలెక్టర్​​పై కేసు
  • హైకోర్టు ఆదేశాలతో ఎఫ్ఐఆర్ నమోదు  

నిజామాబాద్, వెలుగు: కస్టం మిల్లింగ్​కోసం గవర్నమెంట్​ఇచ్చిన వడ్లు గయబ్​అయ్యేలా బోధన్​ మాజీ ఎమ్మెల్యే షకీల్​కు సహకరించిన ముగ్గురు ఆఫీసర్లు బుక్​ అయ్యారు. వారిలో గతంలో జిల్లాకు అదనపు కలెక్టర్​గా పనిచేసిన బడుగు చంద్రశేఖర్​ (ప్రస్తుతం సంగారెడ్డి అదనపు కలెక్టర్​ లోకల్ ​బాడీస్) ఉన్నారు. అలాగే, డీఎస్​వోగా విధులు నిర్వహించిన చంద్రప్రకాశ్ (సస్పెండెడ్​), డిప్యూటీ తహసీల్దార్​ నిఖిల్​రాజ్​ఉన్నారు. మార్చి​25న ఈ ముగ్గురుపై వర్ని పోలీసులు కేసు పెట్టారు. వర్ని మండలానికి చెందిన రైస్​ మిల్లర్​ బోయపాటి కిషోర్​ హైకోర్టులో చేసిన పోరాట ఫలితంగా ఆర్డర్స్​ వెలువడ్డాయి.  గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఎమ్మెల్యేగా ఆఫీసర్లను తన గుప్పిట్లో పెట్టుకొని షకీల్​తన నిర్వహణలోని 5 రైస్​ మిల్స్​కు భారీగా కస్టం మిల్లింగ్​వడ్లను తరలించుకున్నారు. 

2021 ఖరీఫ్​, యాసంగి సీజన్లతో పాటు 2022–23 ఖరీఫ్​కు చెందిన రూ.80 కోట్ల విలువైన 37 వేల టన్నుల వడ్లు మాయమైనట్లు ఇప్పుడు కాంగ్రెస్ ​సర్కారు తేల్చింది.  తాను సేకరించిన వడ్లు టెక్నికల్​ కారణాలతో మిల్లింగ్​ చేసే వీలు లేనందున ఇతర మిల్లులకు పంపినట్లు అంతకుముందు షకీల్ ఆఫీసర్లకు తెలుపగా, ఆ వడ్లు రైస్ ​మిల్స్​కు చేరలేదు. షకీల్​కు సహకరించే ఆలోచనతో అతను ప్రభుత్వానికి వడ్ల బాకీ లేడని అప్పుడు ఆ ముగ్గురు అధికారులు బోగస్​ రిపోర్టులు రెడీ చేశారని మిల్లర్​ బోయపాటి కిషోర్​ కోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాలతో ముగ్గురు ఆఫీసర్లపై కేసు నమోదైంది.