సూర్యాపేటలో దారుణం.. ఇల్లు కూలి ముగ్గురు దుర్మరణం

సూర్యాపేట  జిల్లాలో దారుణం జరిగింది. పాత గోడలు ఉన్న ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారం మండల కేంద్రానికి చెందిన తల్లిదండ్రులు కుమారుడు.. శీలం రాములు (90) శీలం రాములమ్మ (70), శీలం శీను (35) 
స్థానికంగా మట్టి గోడలతో నిర్మించిన ఇంట్లో ఏళ్లుగా నివసిస్తున్నారు. 

ఇటీవల కురిసిన వర్షాలకు మట్టి గోడల్లోకి నీరు చేరాయి. దీంతో అవి మెత్తబడ్డాయి. కుటుంబసభ్యులు ఇంట్లో ఉన్న సమయంలో ఒక్క సారిగా ఇల్లు మొత్తం కూలిపోయింది. మట్టి పెళ్లలు ముగ్గురిపై పడటంతో వారంతా అక్కడికక్కడే మృతి చెందారు. 

గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టినా లాభం లేకుండా పోయింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.