నాగార్జున సాగర్లో ముగ్గురు యువకులు గల్లంతు

నాగార్జున సాగర్లో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. శివాలయం పుష్కర ఘాట్ వద్ద ఈత కోసం వెళ్లిన యువకులు గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నాగరాజు (39),  హర్షిత్ (26) నల్గొండ వాసులుగా, చంద్రకాంత్(20) సాగర్ కి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.  పైలన్ కాలనీలో ఉపనయనం కార్యక్రమానికి హాజరైన యువకులు ఈత కోసమని వెళ్లి గల్లంతయ్యారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  మరోవైపు విద్యుత్ ఉత్పాదన కోసం ప్రాజెక్టు నుంచి 20,000 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. ముగ్గురు యువకులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయినట్టు సమాచారం.