కరీంనగర్ జిల్లాలో కరెంట్ షాక్​తో ముగ్గురు మృతి

 కరీంనగర్ జిల్లాలో కరెంట్ షాక్​తో ముగ్గురు మృతి
  • కరెంట్ పోల్ ఎక్కి  రిపేర్ చేస్తుండగా షాక్ కొట్టి చనిపోయిన అసిస్టెంట్ లైన్ మన్ 
  • ఎల్సీలో ఉండడంతో వ్యక్తమవుతున్న అనుమానాలు
  • బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విద్యుత్ కార్మిక నేతల ఆందోళన
  • కరీంనగర్ జిల్లాలో ఘటన

మానకొండూర్, వెలుగు: విద్యుత్ షాక్ కొట్టి అసిస్టెంట్‌ లైన్‌మన్‌ మృతిచెందిన ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది .కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగల్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన అసిస్టెంట్ లైన్ మన్ జోగు నరేశ్(35) ఇటీవల కరీంనగర్ జిల్లా మానకొండూరు మండ లం కొండ పల్కల సబ్ స్టేషన్ కు బదిలీపై వచ్చాడు. ప్రస్తుతం సబ్ స్టేషన్ పరిధి కెల్లేడు గ్రామ అసిస్టెంట్ లైన్ మన్(ఏఎల్ఎం)గా విధులు నిర్వహిస్తున్నారు. డ్యూటీలో భాగంగా ఎల్సీ తీసుకోగా..  ఆదివారం11కేవీ లైన్ పోల్ ఎక్కి రిపేర్ చేస్తుండగా కరెంట్ షాక్ తో వరి పొలంలో పడి స్పాట్ లో చనిపోయా డు. స్థానిక రైతు చూసి వెంటనే లైన్ మన్ ,,కు తెలిపాడు. ఘటనపై ఏఈ రమేశ్​ ను మధ్యాహ్నం వివరణ కోరగా నరేశ్ కాలు జారి కిందపడ్డాడని చెప్పారు.

సాయంత్రం మళ్లీ అడిగితే కరెంట్ షాక్ తోనే కిందపడి చనిపోయాడని, అయితే ప్రమాదం ఎలా జరిగిందనేది విచారణ చేస్తున్నట్లు తెలిపారు.  ఎల్సీ తీసుకున్నప్పటికీ కరెంట్ సరఫరా జరిగి షాక్ తో మృతిచెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా.. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు వచ్చి నరేశ్​ డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నరేశ్ మృతిపై విచారణ జరిపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని విద్యుత్ కార్మిక యూనియన్ నేతలు ఆందోళనకు దిగారు. అప్పటివరకు పోస్టుమార్టం చేయనివ్వమని ఆస్పత్రి ఆవరణలో యూనియన్ సభ్యులు, బాధిత కుటుంబ సభ్యులు బైఠాయించి డిమాండ్ చేశారు.