నార్సింగిలో పేలిన డిటోనేటర్.. ముగ్గురికి తీవ్ర గాయాలు

నార్సింగిలో పేలిన డిటోనేటర్.. ముగ్గురికి తీవ్ర గాయాలు

రంగారెడ్డి జిల్లా : నార్సింగిలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తూ డిటోనేటర్ పేలడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి బండరాళ్లు పైకి ఎగిరి పడ్డాయి. పేలుడు శబ్దానికి స్థానికులు భయంతో పరుగులు తీశారు. 

పేలుడు విషయం తెలిసి ఘటన స్థలానికి చేరుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డు పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు. 3 రోజుల క్రితం ఒక కాంట్రాక్టర్ డిటోనేటర్లు అమర్చినట్లు  తెలుస్తోంది.