మద్యం మత్తులో ఇద్దరిపై బ్లేడుతో దాడి చేసిన ముగ్గురు వ్యక్తులు

మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తులను మరో ముగ్గురు వ్యక్తులు కలిసి బ్లెడుతో గోంతు కోసిన ఘటన వరంగల్ లో జరిగింది. ఈ దాడిలో గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వరంగల్ లెబర్ కాలనీకి చెందిన కృపాకర్ (17), బంటి (18) అనే ఇద్దరు యువకులు తమ బందువుల సంవత్సరికానికి హాజరయ్యారు. అక్కడ ఆ కార్యక్రమం పూర్తికాగానే సాయత్రం లెబర్ కాలనీలోని వైన్ షాపులో మద్యం తీసుకోని వెళ్లి ఇండోర్ స్టేడియంలో సేవిస్తున్నారు. కాసేపటికి అక్కడికి మరో ముగ్గురు వ్యక్తులు మద్యం తీసుకొని వచ్చారు. ఈ ముగ్గురికి కృపాకర్, బంటి పాత పరిచయం ఉండటంతో అందరూ కలిసి మద్యం సేవించారు. వీరందరికి పాతకక్షలు ఉన్నాయి. తాగిన మత్తులో ఆ కక్షలు గుర్తుకురావడంతో ఇరు వర్గాల మద్య మాటామాటా పెరిగి కృపాకర్, బంటులని.. ముగ్గురు వ్యక్తులు బ్లెడుతో గోంతు కోశారు. కృపాకర్, బంటిలకు తీవ్ర గాయాలుకావడంతో వారి నుంచి తప్పించుకుని ఇంటికి వచ్చారని కుటుంబ సభ్యులు తెలిపారు. రక్తం మరకలతో ఇంటికి వచ్చిన కృపాకర్, బంటిలను చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కృపాకర్, బంటిల కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మిల్స్ కాలనీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ వారిపై అకారణంగా దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబసభ్యులు పోలీసులను కోరుతున్నారు.

For More News..

ఇక నుంచి ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు ‘మీకోసం’