ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు కుచ్చుటోపీ.. ముగ్గురు అరెస్ట్

హైదరాబాద్ : ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగ యువతను మోసం చేసిన ముగ్గురు వ్యక్తులను మంగళవారం (మే 30న) అరెస్టు చేశారు పోలీసులు. నిందితుల వద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్లు, రూ.93 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. 

మోసపోయిన వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. చివరకు విచారణ ముగ్గురు దొరికిపోయారు. ముగ్గుర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిరుద్యోగ యువతీ, యువకులు ఇలాంటి మోసగాళ్ల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 

మంచిర్యాల జిల్లా ఇందారం గ్రామానికి మండల భాస్కర్, పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణానికి చెందిన గంగారపు మధు మూర్తి, చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన బత్తిని వైకుంఠం ఉన్నారు.