ఈజీ మనీకి అలవాటు పడి చోరీలు

నల్లగొండ జిల్లా :సెల్ టవర్లకు ఉపయోగించే కేబుల్ వైర్లను చోరీ చేస్తున్న ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.40 లక్షల విలువ గల మెటీరియల్ ను స్వాధీనం చేసుకున్నారు. 

నల్గొండ జిల్లా ఎస్పీ అపూర్వరావు వెల్లడించిన వివరాల ప్రకారం.. చోరీ కేసుల్లో ముగ్గురు నిందితులపై మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైందని చెప్పారు. అరెస్ట్ అయిన ముగ్గుర్ని రిమాండ్ కు తరలించామన్నారు. ఈజీ మనీకి అలవాటు పడ్డ యువకులు టెక్నాలజీని ఉపయోగించి..రాత్రి వేళల్లో కేబుల్ వైర్లను చోరీ చేస్తున్నారని తెలిపారు. దొంగతనం చేసిన వైర్లను అమ్మి.. వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తున్నారని వెల్లడించారు. దొంగతనం కేసులో మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని కూడా అతి త్వరలోనే పట్టుకుంటామని జిల్లా ఎస్పీ అపూర్వరావు చెప్పారు.