
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మడకశిర సరిహద్దులో ఆగివున్న లారీని ఇన్నోవా కారు ఢీకొట్టిన ఘటనలో కారులోని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఇన్నోవా డ్రైవర్ తో సహా ఒక మహిళ ఓ చిన్నారి అక్కడికక్కడే చనిపోయారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను కర్ణాటకలోని మాధుగిరి హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఇన్నోవా కారు బెంగళూరు నుండి పావగడ కు వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ గుడిబండ మండలం ఎన్ఆర్ రొప్పం గ్రామానికి చెందిన వ్యక్తి కాగా, మిగతా మృతులు కర్ణాటక లోని పావగడకు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.