
నర్సింహులపేట (దంతాలపల్లి), వెలుగు : చనిపోయిన వ్యక్తుల పేరుతో నిధులు డ్రా చేసిన ముగ్గురు సెక్రటరీలపై సస్పెన్షన్ వేటు పడింది. మహబుబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలోని గున్నేపల్లిలో చనిపోయిన వ్యక్తుల పేరుతో పింఛన్ డ్రా చేసిన విషయంలో మృతుడి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు గత నెల ఆందోళనకు దిగారు. ఆఫీసర్లు ఎంక్వైరీ చేయగా గున్నేపల్లితో పాటు వాల్యాతండా, లక్ష్మీపురంలో సైతం అక్రమాలు జరిగినట్లు తేలింది. దీంతో మూడు గ్రామాల సెక్రటరీలు అక్షర, శ్రీకాంత్, వెంకన్నను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శశాంక ఆర్డర్స్ జారీ చేసినట్లు ఎంపీడీవో తెలిపారు.