కోల్బెల్ట్, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ముగ్గురు హ్యాండ్బాల్క్రీడాకారులు నేషనల్ లెవల్ పోటీలకు ఎంపికయ్యారని హ్యాండ్బాల్అసోసియేషన్ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్ గోనె శ్యాంసుందర్రావు, జనరల్సెక్రటరీ కనపర్తి రమేశ్ సోమవారం తెలిపారు.
ఈనెల 15 నుంచి 17 వరకు ఆసిఫాబాద్గిరిజన క్రీడా పాఠశాలలో నిర్వహించిన 45వ రాష్ట్ర జూనియర్ బాలికల హ్యాండ్బాల్ పోటీల్లో ఉమ్మడి జిల్లా జట్టు మూడో స్థానంలో నిలిచిందన్నారు. పోటీల్లో జట్టులోని టి.సత్యభామ(కెరమెరి), బి.అంజలి(తిర్యాణి), ఎస్.అనిత(జైనూర్) ప్రతిభ కనబర్చడంతో నేషనల్ లెవల్ పోటీలకు ఎంపికయ్యారన్నారు. ఈనెల 27 నుంచి 31 వరకు బిహార్లోని సరేన్ పట్టణంలో జరిగే పోటీల్లో వీరు తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. వీరిని పలువురు అధికారులు అభినందించారు.