వరకట్న వేధింపులు, ఆత్మహత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు

వరకట్న వేధింపులు, ఆత్మహత్య కేసులో ముగ్గురికి జీవిత ఖైదు
  • రూ.50 వేల జరిమానా

ఆమనగల్లు, వెలుగు: వరకట్న వేధింపుల కేసులో ముగ్గురికి జీవితఖైదుతో పాటు రూ. 50 వేల జరిమానా విధిస్తూ ఎల్‌‌‌‌బీనగ్‌‌‌‌ 9క్లాస్‌‌‌‌ జిల్లా సెషన్స్‌‌‌‌ జడ్జి హరీష తీర్పు చెప్పారు. తలకొండపల్లి మండలం పూల్‌‌‌‌సింగ్‌‌‌‌ తండాకు చెందిన పాత్లావత సురేందర్‌‌‌‌కు సునీతతో పెండ్లి అయింది. పెండ్లి టైంలో సునీత తల్లిదండ్రులు కట్నం కింద రూ.5 లక్షలు, రెండు తులాల బంగారం ఇచ్చారు. సురేందర్‌‌‌‌, సునీతకు కూతురు, కొడుకు పుట్టారు. తర్వాత అదనపు కట్నం కోసం సునీతను భర్త సురేందర్‌‌‌‌, ఆడపడుచు సంతోష, అత్త పిక్లీలు శారీరకంగా, మానసికంగా వేధించారు. వేధింపులు భరించలేక సునీత 2021 జనవరి 10న ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి సోదరుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్‌‌‌‌ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో సురేందర్‌‌‌‌, సంతోష, పిక్లీకి జీవిత ఖైదుతో పాటు జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పినట్లు ఎస్సై శ్రీకాంత్‌‌‌‌ తెలిపారు.