లైంగికదాడి కేసులో  ముగ్గురికి జీవిత ఖైదు 

లైంగికదాడి కేసులో  ముగ్గురికి జీవిత ఖైదు 

మణుగూరు, వెలుగు : బాలికపై లైంగికదాడి చేసిన ముగ్గురు యువకులకు జీవిత ఖైదు విధిస్తూ కొత్తగూడెం జిల్లా జడ్జి పాటిల్ వసంత్ తీర్పునిచ్చారు. 2019లో మణుగూరు టౌన్ కు చెందిన బాలిక ఇంటి సమీపంలో ఆడుకుంటుండగా నిందితులు ఆమెను బైక్ పై తీసుకువెళ్లి గాంధీనగర్ చర్చి సమీపంలో లైంగికదాడి చేశారు. తర్వాత పోలీసులు నిందితులను అరెస్టు చేశారు.

సాక్ష్యాధారాలను పరిశీలించిన మేజిస్ట్రేట్​ నిందితులైన డేగల యశ్వంత్, నిట్ట ప్రశాంత్, సిద్ధి నరేశ్​కు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారు. బాలిక పేరిట రూ. 5 లక్షలను జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా ఫిక్సుడ్​డిపాజిట్​చేయాలని ఆదేశించారు. విచారణాధికారులుగా ఐపీఎస్​ఆఫీసర్​డాక్టర్ శబరీశ్, సీఐ భాను ప్రకాష్ ఛార్జ్​షీట్ వేయగా స్పెషల్ పీపీ రావి విజయ్ కుమార్ వాదనలు వినిపించారు. కోర్టు డ్యూటీ ఆఫీసర్ అశోక్, లైజన్ ఆఫీసర్లుగా ఎస్కే ఘని  వ్యవహరించారు.