సీజీఓ టవర్​పై నుంచి దూకి ఐటీ ఇన్ స్పెక్టర్​ ఆత్మహత్య​

సీజీఓ టవర్​పై నుంచి దూకి ఐటీ ఇన్ స్పెక్టర్​ ఆత్మహత్య​

పద్మారావునగర్/జీడిమెట్ల, వెలుగు: కవాడిగూడలోని సెంట్రల్​గవర్నమెంట్​ఆఫీసెస్(సీజీఓ) టవర్​పై నుంచి దూకి ఓ ఐటీ ఇన్​స్పెక్టర్ సూసైడ్​చేసుకున్నారు. ఈసీఐఎల్​లో ఉండే జయలక్ష్మీరమేశ్(51) రెండున్నరేండ్లుగా కవాడిగూడలోని సీజీఓ టవర్​ లో ఇన్​కమ్​ట్యాక్స్​ఆఫీసులో ఇన్​స్పెక్టర్​గా పనిచేస్తోంది. 2016లో భర్త రమేశ్​తో విడాకులు తీసుకున్న జయలక్ష్మి కూతురు భావన(22)తో కలిసి ఉంటోంది. కాగా రెండేండ్ల నుంచి జయలక్ష్మి బ్రెస్ట్ క్యాన్సర్​తో బాధపడుతోంది. క్యాన్సర్​అని తెలిసినప్పటి నుంచి మానసింగా కుంగిపోయింది. 

రోజూలాగే శనివారం డ్యూటీకి వెళ్లిన జయలక్ష్మి సీజీఓ టవర్​లోని ఎనిమిదో ఫ్లోర్​నుంచి కిందికి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. భావన ఫిర్యాదు మేరకు  గాంధీనగర్​ఇన్​స్పెక్టర్​డి.రాజు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం డెడ్​బాడీని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనారోగ్య సమస్యలే ఆత్మహత్యకు కారణమని తెలుస్తోంది.

బెట్టింగ్​లో పైసలు పోయి యువకుడు

క్రికెట్‌‌‌‌ బెట్టింగ్‌‌, ఆన్‌‌లైన్‌‌ గేమ్స్‌‌ ఆడి డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. సుచిత్రలోని బీహెచ్‌‌ఈఎల్‌‌ క్వార్టర్స్​లో ఉండే రాజ్ వీర్‌‌ సింగ్‌‌ ఠాకూర్(25) ప్రైవేటు ఉద్యోగి. కొంతకాలగా జీతాన్ని ఇంట్లో ఇవ్వకుండా ఆన్​లైన్​క్రికెట్​బెట్టింగ్ పెడుతున్నాడు. ఒక్క రూపాయి రాకపోగా, పెట్టిన డబ్బంతా పోగొట్టుకున్నాడు. బెట్టింగ్​కోసం మళ్లీ.. మళ్లీ అప్పులు చేశాడు. తీర్చలేక శుక్రవారం అర్ధరాత్రి తర్వాత బైక్​పై సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు వెళ్లాడు. బైకును స్టేషన్​సమీపంలో పార్క్ చేశాడు. గూడ్స్‌‌ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

లవ్​ ఫెయిల్​ అయ్యి మరొకరు..

లవ్​ఫెయిల్​ అయ్యి పేట్ బషీరాబాద్ పీఎస్​ పరిధిలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్గొండ జిల్లా గురుమూర్తి గ్రామానికి చెందిన మహేశ్వరం నాగరాజు(22) బతుకుదెరువు కోసం సిటీకి వచ్చాడు. జీడిమెట్ల బ్యాంకు కాలనీలో ఉంటూ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా నాగరాజు, ఓ యువతిని ప్రేమించుకుంటున్నారు. ఇటీవల ఆమెతో బ్రేకప్​  కావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. శుక్రవారం రాత్రి ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు. స్థానికులు గమనించి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.