త్రిపురాంతంకంలో మూడు కట్లపాములు.. పట్టుకున్న స్నేక్​ క్యాచర్

​ త్రిపురాంతకం మండలంలో  కట్లపాములు కనిపించడం కలకలం రేపింది. మేడపిలో ఓ ఇంటి దగ్గర  అరుదైన జాతికి చెందిన కట్లపాములు కనిపించాయి. ఈ పాములను గమనించిన వ్యక్తి అటవీశాఖాధికారులకు సమాచారం ఇచ్చాడు.  ఫారెస్ట్ సిబ్బంది స్నేక్ క్యాచర్​ మల్లికార్జునకు సమాచారం ఇచ్చారు.  వెంటనే  ఘటనా స్థలానికి చేరుకున్న స్నేక్​ క్యాచర్​ మూడు కట్లపాములను బంధించాడు.  అనంతరం ఆయన మాట్లాడుతూ వీటిలో అటవీ ప్రాంతంలో వదిలేస్తామని.. ఈ పాములు అరుదైన జాతికి చెందిన కట్లపాములను అత్యంత విషపూరితమైనవని తెలిపారు. 

 కట్లపాములు  సాధారణంగా కాటు వేయవు. కానీ కాటు వేస్తే అంతే.  ఈ కట్ల పాము చాలా ఇబ్బంది పెడుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా సముద్రం లోపల ఇది కాటేస్తే.. సముద్రం నుంచి బయటకు వచ్చేసరికి ఆలస్యం అయితే ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందట. ఈ సర్పం మాత్రం చాలా అరుదుగా కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ జీవి సాంకేతిక నామం హైడ్రో ఫిస్‌ సీ స్నేక్‌ అంటారు. ఇవి విషపూరిత మైనవని.. కాటు వేసినపుడు సకాలంలో వైద్యం చేయించుకోకుంటే ప్రాణాలకే ప్రమాదమని తెలిపారు. 

చిన్న చేపలు, రాళ్లలోని నాచు తింటూ ఇవి మనుగడ సాగిస్తాయని చెప్పారు.  సుమారు ఏడడుగులున్న ఈ పాములను పట్టుకుని  అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.అయితే సాధారణంగా ఇది మనుషులను చూస్తే భయపడి దూరంగా  పారిపోతుందట. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే  ఆదమరచి ఉంటే మాత్రం కాటేస్తుందని చెప్తున్నారు.మామూలు విషసర్పాలతో పోలిస్తే దీని విషం కొంచెం‌ ఎక్కువ ఇబ్బంది కలిగిస్తుందని అంటున్నారు. . మామూలు సందర్భాల్లో అయితే ఈ విషానికి‌ విరుగుడు మందు ఉంటుంది