రామ్‌చరణ్‌ కొత్త సినిమా.. అప్పుడే మూడు పాటలు రెడీ..!

రామ్‌చరణ్‌ కొత్త సినిమా.. అప్పుడే మూడు పాటలు రెడీ..!

‘గేమ్‌ఛేంజర్‌’లో రామ్‌చరణ్‌  పాత్ర షూటింగ్ పూర్తి కావడంతో ఈ సినిమాను క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయనున్నట్టు దిల్‌రాజు తెలిపారు. దీంతో ఫ్రీ అయిన రామ్ చరణ్ తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వలో రాబోతోన్న ఆర్‌సీ 16 కోసం రెడీ అవుతున్నారు. మరో వైపు దర్శకుడు బుచ్చిబాబు సైతం అప్పుడే పాటల రికార్డింగ్‌పై దృష్టిపెట్టారు. సంగీత దర్శకుడు ఏ.ఆర్‌.రెహమాన్‌తో ఇప్పటికే ఆయన మూడు పాటలకు ట్యూన్స్‌ రెడీ చేయించినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు ‘పెద్ది’ అనే టైటిల్‌ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో  జాన్వీకపూర్‌ హీరోయిన్ గా నటించనుంది. కన్నడ సూపర్‌స్టార్‌ శివరాజ్‌కుమార్‌ కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. మైత్రీమూవీమేకర్స్‌, వృద్ధి సినిమాస్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. స్ట్ప్రోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండనుందని టాక్.