ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి

ఈతకు వెళ్లి ముగ్గురు విద్యార్థులు మృతి

వరంగల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక పుట్టలమ్మ రిజర్వాయర్ లో పడి ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. రిజర్వాయర్ లో ఈతకు వెళ్లిన విద్యార్థులను దొడ్డిపాటి మన్విత్ కుమార్ (11), దొడ్డిపాటి మహేష్ బాబు (14), మరియు మునుకుంట్ల విష్ణు తేజ(14)లుగా గుర్తించారు. స్థానికుల ఫిర్యాదుతో కేయూ పోలీస్ స్టేషన్ సీఐ డేవిడ్ రాజ్ మరియు ఎస్సై లు పోలీసు సిబ్బందితో రిజర్వాయర్ దగ్గరకు వచ్చి గజఈతగళ్లతో గాలింపు చేపట్టారు. సాయంత్రం వరకు గాలించి మన్విత్, మహేష్ మృతదేహాలను బయటకు తీశారు. విష్ణు తేజ మృతదేహం కోసం గాలిస్తున్నారు. విద్యార్థుల మృతితో వారి కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి.

For More News..

డిప్యూటీ కలెక్టర్ గా బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్

టాయిలెట్ ను క్వారంటైన్ గా మార్చుకున్న యువకుడు

కరోనావైరస్ ను చంపే ఛార్జింగ్ మాస్క్