న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఉపాధ్యాయులకు ‘జాతీయ ఉపాధ్యాయ అవార్డు - 2024’లు దక్కాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీలో ప్రభాకర్ రెడ్డి (తిరుమలాయపాలెం, జెడ్పీహెచ్ఎస్), టీ.సంపత్ కుమార్ (దమ్మన్నపేట, జెడ్పీహెచ్ఎస్), హయ్యర్ ఎడ్యుకేషన్లో డాక్టర్ నందవరం మృదుల ఈ అవార్డులు అందుకున్నారు.
గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రదా నం చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణ జయంతిని పురస్కరించుకొని ఏటా సెప్టెంబర్ 5న కేంద్ర విద్యాశాఖ ఈ అవా ర్డులను అందిస్తున్నది. ఈ సారి దేశ వ్యా ప్తంగా మొత్తం 82 ఉత్తమ టీచర్లను నేషన ల్ టీచర్స్ అవార్డులకు ఎంపిక చేసింది.