పట్టాలపై కూర్చుని పబ్ జీ గేమ్.. రైలు కింద పడి ముగ్గురు కుర్రోళ్లు డెడ్

పట్టాలపై కూర్చుని పబ్ జీ గేమ్.. రైలు కింద పడి ముగ్గురు కుర్రోళ్లు డెడ్

బీహార్‌: పశ్చిమ చంపారన్ జిల్లాలో గురువారం విషాద ఘటన చోటుచేసుకుంది. రైలు పట్టాలపై కూర్చొని పబ్ జీ (PUBG) మొబైల్ గేమ్ ఆడుతూ ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. కనీసం రైలు కూత కూడా అలెర్ట్ చేయలేదంటే, గేమ్‌లో వారు ఎంత లీనమైపోయారో స్పష్టమవుతోంది. ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్కతియాగంజ్-ముజఫర్‌పూర్ రైలు సెక్షన్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. 

గేమ్ ఆడుతున్న సమయంలో ముగ్గురు యువకులు చెవుల్లో ఇయనర్ ఫోన్లు పెట్టుకోవడంతో ట్రైన్ రావడాన్ని గుర్తించలేదని తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరి శరీర భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. తెగిపోయిన కాళ్లు, చేతులు చెల్లాచెదరుగా పడిపోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే వందలాది మంది స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

మృతులను పుర్కాన్ ఆలం, సమీర్ ఆలయం, హబీబుల్లా అన్సారీగా గుర్తించారు. రైల్వే ట్రాక్‌పై కూర్చొని మొబైల్‌ ఫోన్లలో గేమ్స్‌ ఆడుతున్నందునే ప్రమాదం జరిగిందని ప్రాథమిక విచారణలో తేలిందని రైల్వే అధికారులు తెలిపారు.