కరీంనగర్ జిల్లాలో వైరస్​తో మూడు వేల కోళ్లు మృతి

కరీంనగర్ జిల్లాలో వైరస్​తో మూడు వేల కోళ్లు మృతి

గంగాధర, వెలుగు :  వైరస్ సోకి వేలల్లో కోళ్లు చనిపోయాయి. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్ జీపీ పరిధిలోని పౌల్ట్రీ ఫామ్ లో ఒక్కసారిగా కోళ్లకు వైరస్ సోకింది. దీంతో మూడు వేల కోళ్లు చనిపోయాయి. బర్డ్ ఫ్లూ కాదని సాధారణ వైరస్ అని, ఇతర కోళ్ల ఫారాలకు సోకే చాన్స్ లేదని కోళ్లఫామ్ యజమాని నర్సయ్య తెలిపారు. కాగా.. మండలంలోని పలు కోళ్ల ఫామ్ ల్లో మూడు రోజులుగా వైరస్ సోకి కోళ్లు చనిపోతుండగా స్థానిక వెటర్నరీ సిబ్బందికి చెప్పడంలేదు. 

వెటర్నరీ డాక్టర్  సందీప్​రెడ్డిని వివరణ కోరగా ట్రైనింగ్​లో ఉన్నానని, కోళ్ల చనిపోతున్న విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు.  కోళ్లు చనిపోయిన ప్రదేశానికి సిబ్బందిని పంపగా ఏమీ లేవని చెప్పినట్టు పేర్కొన్నారు.