ఉక్రెయిన్,రష్యా యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. రష్యా సైన్యం జరిపిన మారణహోమంలో ఉక్రెయిన్ కు చెందిన దాదాపు 1000 మంది సైనికులు మరణించారు. మరో 10 వేల మందికిపైగా గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు.ఉక్రెయిన్ రాజధాని కీవ్ పరిసర ప్రాంతాల్లో రష్యా సైనికులు సృష్టించిన ఘాతుకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పుతిన్ సేనలు ఉపసంహరణ తర్వాత రాజధాని పరిసర ప్రాంతాల్లో దాదాపు 900 మందికిపైగా పౌరుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో ఎక్కువ మంది తుపాకీ తూటాలకు బలైనవారే ఉన్నారని అక్కడి పోలీసులు చెబుతున్నారు. మరికొంత మందిని అతికిరాతకంగా హింసించి,ఉరివేసి చంపినట్లు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కీవ్ పై క్షిపణి దాడులను వేగవంతం చేస్తామని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించిన కొద్దిసేపటికే పుతిన్ సైన్యం ఉక్రెయిన్ లో జరిపిన దారుణాలను బయటపెట్టారు జెలెన్ స్కీ.
మరిన్ని వార్తల కోసం
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలె
తెలంగాణలో రాహుల్ టూర్ ఖరారు!