జగిత్యాల, వెలుగు : ఒంటరి గా ఉన్న మహిళ మెడ లోంచి గుర్తు తెలియని వ్యక్తులు బంగారు చైన్ ఎత్తుకువెళ్లారు. జగిత్యాల పట్టణం సంతోష్ నగర్ కు చెందిన నీలగిరి విజయ భర్త చనిపోగా, ఒంటరిగా ఉంటోంది. కొడుకు ప్రవీణ్ హైదరాబాద్‌లో బిజినెస్ చేస్తున్నాడు.
ఈ నెల 25న బుధవారం రాత్రి విజయ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి మెడలోంచి మూడు తులాల బంగారు చైన్‌ను దొంగలించి పరార్ అయినట్లు బాధితురాలు చెప్పారు. బాధితురాలు విజయ కొడుకు ప్రవీణ్ ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై కిరణ్ కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేపట్టారు.