Good Health : 8 గంటల డైట్ ఫాలో అయితే.. 3 వారాల్లో 10 కేజీల బరువు తగ్గొచ్చు..!

Good Health : 8 గంటల డైట్ ఫాలో అయితే.. 3 వారాల్లో 10 కేజీల బరువు తగ్గొచ్చు..!

అదేంటీ.. రోజుకు ఇరవై నాలుగు గంటలు కదా!  డైట్ చేస్తే.. 24 గంటలూ చేయాలి కానీ.. ఈ ఎనిమిది గంటల డైట్ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? అవును.. ఎనిమిదిగంటల డైటే.. క్రమం తప్పకుండా చేస్తే ... మూడు వారాల్లోనే పది కిలోలబరువు తగ్గిచ్చునని ఎక్స్ పర్ట్స్   అంటున్నారు. 

బరువు  తగ్గడం కోసం చాలామంది ఏవేవో చేసి  కష్టపడుతుంటారు. తీరా చూస్తే.. బరువులో పెద్ద మార్పేం కనపడదు. కొందరు కడుపు మాడ్చుకొని మరీ బరువు తగ్గించుకోవడం కోసం శ్రమపడిపోతుంటారు. అలాంటి వారి కోసమే ఈ ఎనిమిది గంటల డైట్...  మూడు వారాల్లోనే పది కిలోలు బరువు తగ్గించి మిమ్మల్ని ఫిట్  గా చేసే డైట్ గా ఎక్స్ పర్టులు చెప్తున్నరు. పరిశోధనలు సైతం ఈ డైట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేవని తేల్చి  చెప్పాయి. ఎనిమిది గంటల డైట్ అంటే.. ఉపవాసం ఉండే పద్ధతి అన్నమాట. దీని వల్ల ముందుగా శరీరంలో పేరుకుపోయిన కొవ్యు కరిగిపోతుంది. రక్తపోటును కూడా అదుపులోకి తెస్తుంది.

8గంటల డైట్ అంటే ఏంటి?

తరచూ ఉపవాసం ఉండడమే ఎనిమిదిగంటల డైట్.   రకరకాల డైటింగ్ పద్ధతుల్లో ఇదొకటి.. చాలా సులభంగా తొందరగా బరువు తగ్గించి శరీరంలో జీర్ణక్రియను ఉత్తేజం చేసే  డైట్ ఇది.   అంతేకాదు... మైటోకాండ్రియా పనితీరును ప్రేరేపిస్తుంది. మైటోకాండ్రియా పనేంటంటే.. శరీరంలోని గ్లూకోజును శక్తి రూపంలోకి మార్చి శరీరానికి అందిస్తుంది. దీంతో మనం ఉత్సాహంగా అన్ని పనులు చేసుకోగలుగుతాం. ఈ ఎనిమిది గంటల డైట్ లో 16 గంటల వరకు ఏమీ తినకుండా ఉండాలి. దీంతో అప్పటి వరకు పొట్టలో ఉన్న ఆహార పదార్థాలు శరీరానికి అవి పూర్తయిన తర్వాత మైటోకాండ్రియా ఉత్తేజితమై గ్లూకోజ్ ను శరీరానికి అందించడం మొదలవుతుంది. కండరాల్లో, కాలేయంలో నిల్వ చేయబడిన గ్లూకోజ్ ను గ్లైకోజెన్ గా మార్చి శరీరానికి అందిస్తుంది. దీంతో నీరసం రాకుండా ఉంటుంది..

ఏం జరుగుతుంది?

ఈ ఎనిమిది గంటల డైట్ వల్ల బాడీలోని జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది.  శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు... షుగర్ లెవల్స్ వేగంగా కరిగిపోతాయి.  జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. ఈ పసులన్నీ సవ్యంగా జరగడం వల్ల శరీరంలోని అనవరసమైనవి (టాక్సిన్స్) శరీరం నుంచి బయటకు వెళ్లిపోతాయి. అనవ సర కొవ్వు కరిగి క్రమంగా బరువు తగ్గుతుంది.

ఎలా చేయాలి?

అన్నింటికంటే ఇది చాలా ముఖ్యం. ఎలా చేయాలో తెలియకుండా ఎడిమిది గంటల డైట్ ప్రారంభిస్తే అసలుకే మోసం. ఈ డైట్ ను   రోజు  విడిచి రోజు పాటించాలి. లేదంటే.. రెండురోజులకు ఒకసారి పాటించేలా ప్లాన్ చేసుకోవచ్చు. బరువు తగ్గుతున్నట్లు అనిపిస్తే   కంటిన్యూ చేయాలి. లేకపోతే ఆపేయవచ్చు.  ఆకలి వేసే టైమ్ .. వ్యాయామానికి కేటాయిస్తున్న టైమ్... ఆఫీసులో పనిచేసే టైమ్...  రెస్ట్ తీసుకునే టైమ్ ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ఈ డైట్ ప్లాన్ చేసుకోవాలి. ఒకరకంగా చెప్పాలంటే రంజాన్ మాసంలో ముస్లింలు పాటించే రోజూ ఉపవాసంలాగే ఉంటుంది ఈ డైట్.  రెగ్యులర్ గా ఒకే సమయానికి తినేలా ప్లాన్ చేసుకోవాలి..

ఏం తినాలి...

ప్రొటీన్ బీన్స్, సోయా, డైరీ ప్రొడక్ట్స్, గుడ్లు, చేపలు, గోధుమలు, బ్రౌన్ రైస్, కూరగాయలు, మాత్రమే తీసుకోవాలి. మసాలాలు, చాక్లెట్లు, కొవ్వు పదార్థాలు, నూనె పదార్థాలు తీసుకోవద్దు. కూల్ డ్రింక్స్, ఆల్కహాల్ జోలికి అసలే వెళ్లవద్దు...

ఫలితం ఎలా ఉంటుంది?

ఈ డైట్ పాటించిన చాలా మంది  ఎలాంటి మజిల్ లాస్ రాకుండా బరువు తగ్గినట్టు పరిశోధనల్లో తేలింది. బాడీలో ఇన్సులిన్  సెన్సిటివిటీ పెరిగింది. దీంతో డయాబెటిస్ రిస్క్ తగ్గింది. మెటబాలిక్ సిస్టమే యాక్టివ్ అయి....  జీర్ణ సంబంధ వ్యాధులు దరిచేరకుండా కాపాడుతుంది. ఈ ఎనిమిది గంటల డైట్ చాలా ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. శరీరంలోని ఎల్టీఎల్ కొవ్వును తొలగిస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. శరీరంలోని టాక్సిన్లను తొలగిస్తుంది. అదనపు వాటర్ వెయిట్ ను తొలగించి టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని నివారిస్తుంది. హార్మోన్ల అసమతుల్యం రాకుండా అడ్డుకుంటుంది. గుండె వ్యాధులను దూరంచేస్తుంది.

-వెలుగు,లైఫ్-