బషీర్ బాగ్, వెలుగు: దివ్యాంగులకు సమాన అవకాశాలు కల్పించాలని టీసీపీ వేవ్ సంస్థ ప్రతినిధి పవన్ కోరారు. కింగ్ కోఠిలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం శ్రీ భగవాన్ మహావీర్ సహాయ సమితి ఆధ్వర్యంలో 50 మంది దివ్యాంగులకు కృత్రిమ కాళ్లు, వీల్ చైర్లు, త్రీ వీలర్స్‌ను అందజేశారు.
దివ్యాంగులకు కొంత సాయం చేస్తే సమాజంలో గౌరవప్రదంగా జీవించగలరన్నారు.