హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో సీటు కోసం కొట్టుకున్న మహిళలు..

హైదరాబాద్లో ఆర్టీసీ బస్సులో సీటు కోసం కొట్టుకున్న మహిళలు..

హైదరాబాద్ లో మహిళలు ఆర్టీసీ బస్సులో సీటు కోసం కొట్టుకున్నారు. ఆది కూడా చెప్పుతో కొట్టుకునే రేంజ్ కి వెళ్ళింది గొడవ. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే... హకీంపేట నుండి రంగారెడ్డి జిల్లాకు బయలుదేరిన బస్సు బొల్లారం దగ్గరకు చేరుకోగానే.. సీటు కోసం ముగ్గురు మహిళల మధ్య గొడవ మొదలైంది. 

మాటలతో మొదలైన గొడవ చెప్పులతో కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. తోటి ప్రయాణికులు సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా గొడవ సద్దుమనగలేదు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో.. ఇదంతా ఫ్రీ బస్సు ఎఫెక్ట్ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్స్.

తెలంగాణలో బస్సుల్లో మహిళలు గొడవపడటం ఇది కొత్త కాదు.. గతంలో కూడా ఓ మహిళ సీటు కోసం తోటి మహిళలను కొట్టిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. మరో వీడియోలో సీటు కోసం కొట్టుకుంటున్న మ్హిలాలకు సర్ది చెప్పబోయిన కండక్టర్ ని కొట్టిన ఘటన వైరల్ అయ్యింది. 

Also Read:-కట్టలకొద్దీ పాత కరెన్సీ నోట్లు.. గుట్టుగా మార్చే ప్రయత్నం చేశారు.. 

 తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ప్రారంభించిన ఉచిత బస్సు పథకం ఈ రకమైన ఘటనలకు దారి తీయటం ఆందోళనకరం. మహిళల అభ్యున్నతి కోసం రేవంత్ సర్కార్ ఉచిత బస్సు పథకం ప్రారంభిస్తే దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన మహిళలు ఇలా వీధి కొళాయి దగ్గర పంచాయితీలాగా తయారు చేయడం విచారకరం.