మూడేళ్ల పాప మూడు రోజులుగా శిథిలాల కిందే..

కూలిన బిల్డింగ్‌ కిందనే 3 ఏండ్ల పాప.. 3 రోజులు

బయటకు తీయగానే రెస్క్యూ సిబ్బంది వేలు పట్టుకున్న పాప
టర్కీలో బిల్డింగ్ శిథిలాల నుంచి కాపాడిన సిబ్బంది
భూకంపంతో ఇప్పటి వరకు 81 మంది చనిపోయిన్రు

ఇజ్మిర్‌‌‌‌(టర్కీ): పేద్ద బిల్డింగ్.. ఒక్కసారిగా కూలింది. మూడేళ్ల పాప శిథిలాల్లో చిక్కుకుపోయింది. అంతా చీకటి. పైన మోయలేనంత బరువు. పైకి లేవొస్తలేదు. పక్కకు జరగొస్తలేదు. అక్కలు కనవడ్త లేరు. పిలిచినా అమ్మ పలుకుతలేదు. అలా గంటా రెండు గంటలు కాదు.. 65 గంటలు ఆ శిథిలాల కిందే ఉందా చిన్నారి. రెస్క్యూ టీమ్ కాపాడి బయటకు తీయగానే టక్కున ఓ సిబ్బంది చేయిని గట్టిగా పట్టుకుంది. సోషల్ మీడియాలో వైరలైన ఆ ఫొటో ఎంతో మందికి కన్నీళ్లు తెప్పించింది. భూకంపం వల్ల దెబ్బతిన్న టర్కీలోని ఇజ్మిర్ లో సోమవారం జరిగిందీ సంఘటన. ఆ పాప పేరు ఎలిఫ్‌‌ పెరిన్‌‌సెక్‌‌.

ఐసీయూలో చిన్నారికి ట్రీట్​మెంట్​

చిన్నారి ఎలిఫ్ తల్లిని, 10 ఏండ్ల ట్విన్ సిస్టర్స్​ను, 7 ఏండ్ల బ్రదర్​ను భూకంపం వచ్చిన 23 గంటల్లోనే రెస్క్యూ సిబ్బంది బయటకు తీశారు. దురదృష్టవశాత్తు బ్రదర్ చనిపోయాడు. పాప కోసం వెతికినా జాడ దొరకలేదు. సోమవారం పొద్దున శిథిలాల కింద చిన్నారిని కనిపెట్టారు. 7 గంటల పాటు శ్రమించి బయటకు తీశారు. హాస్పిటల్​కు తరలించారు. పాప చేయి పట్టుకున్న అగ్నిమాపక సిబ్బంది మౌమ్మర్ సెలిక్ మాట్లాడుతూ.. ‘బయటకు తీయగానే నా వేలును చిన్నారి గట్టిగా పట్టుకుంది. ఆమె ముఖంపై దుమ్మును క్లీన్​చేశాను’ అన్నారు. ఫస్ట్​ ఎయిడ్​ టెంట్​లోకి తీసుకెళ్లే వరకు పాప తన చేయిని విడవలేదని చెప్పారు. ప్రస్తుతం పాప ఐసీయూలో ట్రీట్​మెంట్​ పొందుతోందని అధికారులు తెలిపారు.

For More News..

ఇడ్లీ సాంబార్ అంటే మస్త్ ఇష్టం.. అమెరికా వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థి

చలికాలంలో న్యుమోనియాను అడ్డుకోండిలా..