గోదావరిఖని, వెలుగు : రామగుండం టౌన్మజీద్ కార్నర్ వద్ద బుధవారం మూడేళ్ల బాలుడు హైమాన్పై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇంటి సమీపంలో బహిర్భూమికి వెలుతుండగా అటుగా వచ్చిన కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి తల పైభాగంలో కొరికాయి. స్థానికులు, కుటుంబ సభ్యులు గమనించి వాటిని తరిమారు.
అనంతరం వెంటనే గోదావరిఖనిలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కు తరలించారు. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ ఫోన్లో ధైర్యం చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు హాస్పిటల్కు వెళ్లి బాలుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.