నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో మూడేళ్ల బాలుడి కిడ్నాప్

నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో మూడేళ్ల బాలుడి కిడ్నాప్

నల్లగొండ  ప్రభుత్వాస్పత్రిలో మూడేళ్ల బాలుడి కిడ్నాప్ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హాస్పిటల్ ఆవరణలో ఆడుకుంటున్న బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. ఈ సంఘటన మంగళవారం జరగ్గా.. ఎంత వెతికిన తల్లిదండ్రులకు బాలుడు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది..పూర్తి వివరాల్లోకి వెళితే.. 

బాధిత కుటుంబం శహమున్నిసాబేగం, అహ్మద్ దంపతులు వారి కొడుకు అబూతో కలసి నల్లగొండ ప్రభుత్వాస్పత్రి ఆవరణలో జీవనం ఉంటున్నారు. హాస్పిటల్‌ ఆవరణలో ఆడుకుంటున్న మూడేళ్ల చిన్నారి అబును గుర్తు తెలియని వ్యక్తి ఎత్తుకెళ్లాడు. సంఘటన మంగళవారం మధ్యాహ్నం జరిగింది. మంగళవారం సాయంత్రం దవాఖాన ఆవరణలో వెతికిన బాలుడి తల్లిదండ్రులు ఆచూకీ దొరకకపోవడంతో నల్లగొండ 2 టౌన్ పోలీసులను ఆశ్రయించారు. 

ALSO READ | ఇంత శాడిజమా.. మత్తు ఇంజెక్షన్ డోసేజ్ 5 రెట్లు పెంచి ఇచ్చి.. తమ్ముడి భార్యను చంపేసింది..!

బాలుడిని ఒక వ్యక్తి మాయమాటలు చెబుతూ ఫోన్లో మాట్లాడిస్తూ తీసుకెళ్తున్నట్టుగా హాస్పిటల్‌ ఆవరణలో ఉన్న సీసీ కెమెరాలు రికార్డుల్లో నమోదైంది. హాస్పిటల్‌ నుంచి బాలుడిని రైల్వే స్టేషన్ వైపు తీసుకెళ్లినట్టు గుర్తించారు. అయితే సీసీ కెమెరాల్లో దుండగుడు అక్కడికి వచ్చినట్టుగా ఎక్కడా కనబడలేదు. దీంతో బస్టాండ్ ఆవరణలో వెతికినా కూడా ఎక్కడ కూడా సీసీ కెమెరాల్లో బాలుడిని తీసుకెళ్తున్న ఫుటేజ్ లభ్యం కాలేదు. దీంతో బాలుడిని నల్లగొండ పట్టణంలోనే ఎక్కడో చోట దాచినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

ఈ క్రమంలో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి దుండగుడి కోసం గాలిస్తున్నారు. అయితే గత మూడేండ్లుగా బాధిత కుటుంబం శహమున్నిసాబేగం, అహ్మద్ దంపతులు తమ కొడుకు అబూతో కలసి దవాఖాన ఆవరణలోనే జీవనం సాగిస్తున్నప్పటికీ అక్కడి సిబ్బంది వారిని గుర్తించకపోవడం గమనార్హం.