- గొంతులో మక్కలు ఇరుక్కుని మూడేండ్ల బాలిక మృతి
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురంలో ఘటన
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలో బుధవారం మొక్కజొన్న గింజలు గొంతులో ఇరుక్కోవడంతో ఓ మూడేండ్ల బాలిక ప్రాణాలు కోల్పోయింది. మండలంలోని రాంపురం గ్రామానికి చెందిన వెంకటకృష్ణ-, అభశ్విని దంపతుల కూతురు (3) బిందుశ్రీ మంగళవారం రాత్రి ఇంట్లో ఆడుకుంటోంది. అప్పుడే వెంకటకృష్ణ, అశ్విని భోజనం చేస్తున్నారు. అంతకుముందు మొక్కజొన్న కంకులు తెచ్చుకుని తినడంతో కొన్ని కిందపడ్డాయి. వీటిని చూసిన బిందుశ్రీ తినగా గొంతులో అడ్డుపడడంతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది ఏర్పడింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని, ఖమ్మం, హైదరాబాద్ తరలించాలని అక్కడి డాక్టర్లు సూచించారు. కూలి పనులు చేసుకునే వెంకటకృష్ణ డబ్బుల కోసం తిరిగి తిరిగి హైదరాబాద్ తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో పాప ప్రాణం పోయింది.