ఆడదస్నాపూర్ లో షార్ట్ సర్క్యూట్ తో మూడిండ్లు దగ్ధం

ఆడదస్నాపూర్ లో షార్ట్ సర్క్యూట్ తో మూడిండ్లు దగ్ధం
  • ఓ ఎద్దు మృతి.. రెండింటికి గాయాలు

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ మండలం ఆడదస్నాపూర్ లో శుక్రవారం రాత్రి షార్ట్​సర్క్యూట్ కారణంగా మూడిండ్లు దగ్ధమయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలోని ధరావత్ బలరాం, ధరావత్ నాందేవ్, ధరావత్ జమిందార్ ఇండ్లపై నుంచి విద్యుత్ వైర్లు ఉన్నాయి. రాత్రి గాలికి ఒకదానికొకటి తగిలి నిప్పురవ్వలు చెలరేగాయి. అవి గడ్డి వాముపై పడి మంటలు చెలరేగి సమీపంలోని ఈ మూడిండ్లకు అంటుకున్నాయి. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించగా ఫైరింజన్ వచ్చేలోపు ముగ్గురి ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. 

పక్కనే ఉన్న పశువుల పాకకు నిప్పుంటుకోవడంతో ఓ ఎద్దు చనిపోయింది.  మరో రెండు ఎడ్లకు తీవ్ర గాయాలయ్యాయి. మూడిండ్లు, వాటిల్లోని వస్తువులు కాలిపోవడంతో సుమారు రూ. లక్షల వరకు నష్టం జరిగినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం బాధిత కుటుంబాలను సింగిల్ విండో చైర్మన్ అలిబీన్ అహ్మద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీనివాస్ పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.