కరీంనగర్ జిల్లాకు మూడు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు

కరీంనగర్ జిల్లాకు మూడు ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు
  • హుస్నాబాద్, మంథని, మానకొండూర్ నియోజకవర్గాల్లో ఏర్పాటు 

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మూడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మంజూరయ్యాయి. మానకొండూరు, హుస్నాబాద్, మంథని నియోజకవర్గాల్లో పైలట్ ప్రాజెక్టుగా ఒక్కో స్కూల్ చొప్పున నిర్మించబోతున్నారు. అన్నివర్గాల విద్యార్థులు ఒకేచోట, ఒకే కుటుంబంగా చదువుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే.

తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా 28 స్కూళ్లను ఒకేసారి ప్రారంభించబోతున్నారు. మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం యాదవులపల్లి శివారులోని 20 ఎకరాల ఎస్సారెస్పీ భూమిని ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు కేటాయించింది. కాగా శుక్రవారం యాదవులపల్లిలో, హుస్నాబాద్​ నియోజకవర్గం కోహెడ మండలం తంగళ్లపల్లిలో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణాలకు మంత్రి పొన్నం ప్రభాకర్​ శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. 

 సైదాపూర్​ కల్వర్టు పరిశీలన 

సైదాపూర్, వెలుగు: సైదాపూర్ మండల కేంద్రంలోని సైదాపూర్​ జాగిరిపల్లిలో లోలెవల్​కల్వర్టును పొన్నం ప్రభాకర్​ గురువారం పరిశీలించారు. కొన్నేళ్లుగా భారీవర్షాలకు ఈ కల్వర్టు పైనుంచి నీరు ప్రవహిస్తూ రాకపోకలు నిలిచిపోతున్నాయి. దీంతో స్థానికులు, కాంగ్రెస్ లీడర్లు సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన పరిశీలించారు. బ్రిడ్జి నిర్మాణానికి అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. లీడర్లు దొంత సుధాకర్​, శ్రీనివాస్​, రాజు, సంతోష్​  పాల్గొన్నారు.