ఏపీలో ఘోరం జరిగింది. కోనసీమ జిల్లాలోని గోదావరి నదిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కొత్తపేట నియోజకవర్గం రావులపాలెనికి చెందిన ఈశ్వర్ రెడ్డి , సంపత్ రెడ్డి , జయకుమార్ ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. వీరితో పాటు వెళ్లిన రాజేష్ ఈత రాక గట్టుమీద ఉండిపోయాడు. ఎంత సేపటికి వెళ్లినవాళ్లు రాకపోవడంతో రాజేష్ పోలీసులకు సమాచారం అందించాడు.
విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని గజా ఈతగాళ్లు సహాయంతో మృతదేహం కోసం గాలించారు. ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తామని వెల్లడించారు. ఈతకు వెళ్తే తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు.