వరంగల్ కరీంనగర్ హైవేపై ముగ్గురు యువకుల హల్ చల్

వరంగల్ కరీంనగర్ హైవేపై ముగ్గురు యువకులు హల్ చల్ చేశారు.  భీమారం మెయిన్ రోడ్డుపై బైక్తో స్టంట్స్ చేసే ప్రయత్నం చేశారు.  ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా...ఒకే బైక్పై ముగ్గురు ప్రయాణించారు. దీనికి తోడు..నిలబడి సర్కస్ ఫీట్లు చేశారు. యువకుల విచిత్ర చేష్టలతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే ఆకతాయిల డేంజరస్ డ్రైవింగ్ వీడియో వైరల్ అయింది.

యువకుల అరెస్ట్..

డేంజరస్ డ్రైవింగ్ వీడియో వరంగల్ సీపీ రంగనాథ్  దృష్టికి వెళ్లడంతో..యువకులను అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించాడు. బండి నెంబర్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు  సుర రమేష్, వల్లపు విలాకర్, వల్లపు నాగరాజులను పోలీసులు అరెస్టు చేశారు.