రంగారెడ్డి: అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు యువకులను అరెస్ట్ చేశారు శంషాబాద్ ఎక్సై్ పోలీసులు. గగన్ పహాద్ వద్ద వాహనాలను చెక్ చేస్తుండగా బైక్ పై గంజాయి సరఫార చేస్తున్న ఉత్తర ప్రదే శ్ కు చెందిన అజయ్ అనే యువకుడిని పట్టుకున్నారు.
జయ్ వద్ద రూ. 3 లక్షల విలువైన 2.7 కేజీల గంజాయి, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఇతనికి సహకరించిన అనిల్, కలీల్ ను పోలీసులు అదుపులోకితీసుకున్నారు.
నిషేధిత గంజాయి ఎవరు సరఫరా చేసినా, వినియోగించినా కఠిన చర్యలు తప్పవన్నారు రంగారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరిటెండెంట్ శ్రీనివాస్ హెచ్చరించారు.