ముగ్గురు ప్రాణాలు తీసిన ఈత సరదా.. మృతులు హైదరాబాద్ వాసులు

సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సామలపల్లి గ్రామంలోని చెరువులో ఈత కోసం వెళ్లిన ముగ్గురు యువకులు నీట మునిగి మృతిచెందారు. మాసాన్ పల్లిలో బంధువుల ఇంటికి వచ్చిన ముగ్గురు యువకులు.. ఈత నేర్చుకోవడానికి సామలపల్లి గ్రామ చెరువు వద్దకు వెళ్లారు. చెరువులోకి దిగడంతో ప్రమాదవశాత్తు నీట మునిగి ముగ్గురు మృతి చెందారు. మృతులు హైదరాబాద్ కు వాసులు. 

విషయం తెలియగానే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ముగ్గురు యువకుల మృతదేహాలను చెరువును బయటకు తీయించారు. అనంతరం పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. చనిపోయిన వారిని ఖాసీమ్ (30), సోహెల్ (17), ముస్తఫాగా గుర్తించారు.