గ్రిప్పింగ్ స్క్రీన్‌‌‌‌‌‌‌‌ప్లేతో హత్య..జనవరి 24న రిలీజ్

గ్రిప్పింగ్ స్క్రీన్‌‌‌‌‌‌‌‌ప్లేతో హత్య..జనవరి 24న రిలీజ్

ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవి వర్మ లీడ్ రోల్స్‌‌‌‌‌‌‌‌లో నటించిన  చిత్రం ‘హత్య’. శ్రీవిద్య బసవ దర్శకత్వంలో  ఎస్ ప్రశాంత్ రెడ్డి నిర్మించారు. జనవరి 24న సినిమా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ ‘చిన్నప్పటి నుంచి నాకు విజయశాంతి, మాలాశ్రీలా యాక్షన్ చిత్రాలు చేయాలని ఉండేది. ఈ చిత్రం ద్వారా  ఆ కల నెరవేరింది. ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. అందరూ ఈ సినిమా చూసి మా టీమ్‌‌‌‌‌‌‌‌ను సపోర్ట్ చేయాలని కోరుతున్నా’ అని చెప్పింది. 

పూజా రామచంద్రన్ మాట్లాడుతూ ‘కొంత గ్యాప్ తర్వాత తెలుగులో నటించడం హ్యాపీగా ఉంది. ‘స్వామి రారా’ చిత్రంతో ఇక్కడి ప్రేక్షకులు నన్ను ఆదరించారు. గత చిత్రాల్లాగే ఇందులోని పాత్ర కూడా అందరికీ నచ్చుతుంది’ అని చెప్పింది.  దర్శకురాలు శ్రీవిద్య బసవ మాట్లాడుతూ ‘‘మధ’ తర్వాత ఐదేళ్ల గ్యాప్‌‌‌‌‌‌‌‌తో ఈ చిత్రాన్ని రూపొందించా. అంద‌‌‌‌‌‌‌‌రికీ తెలిసిన క‌‌‌‌‌‌‌‌థే అయిన‌‌‌‌‌‌‌‌ప్పటికీ గ్రిప్పింగ్‌‌‌‌‌‌‌‌గా, సీట్ ఎడ్జ్  థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఆకట్టుకుంటుంది. ట్రైలర్ నచ్చి డిస్ట్రిబ్యూటర్లే మా సినిమాను అడిగారు. ఈ ప్రయాణంలో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని చెప్పింది. నిర్మాత ప్రశాంత్ రెడ్డి, మ్యూజిక్ డైరెక్టర్ న‌‌‌‌‌‌‌‌రేష్ కుమార‌‌‌‌‌‌‌‌న్‌‌‌‌‌‌‌‌, ఎడిట‌‌‌‌‌‌‌‌ర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.