
మెదక్‌టౌన్, వెలుగు: మెదక్ చర్చిలో ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలో సందడి చేశారు. ఉదయం నుంచే ప్రెసిబిటరీ ఇన్చార్జి డాక్టర్ శాంతయ్య ఆధ్వర్యంలో దైవసందేశాన్ని అందించారు. భక్తులు ప్రత్యేక గీతాలాపనలు చేశారు. చర్చి బాధ్యులు, కమిటీ మెంబర్లు సంఘస్తులు తదితరులు పాల్గొన్నారు.
దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు చర్చి ఆవరణలో, గోల్‌బంగ్లా వద్ద టెంట్లు వేసుకొని వంటావార్పు చేసుకుని, ఆనందంగా గడిపారు.