రోడ్లపై డబ్బులు చల్లుతూ..కూకట్పల్లిలో యూట్యూబర్ ఓవరాక్షన్

యూట్యూబ్ లో వ్యూస్ కోసం.. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తున్నారు యువత.. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశాల్లో వీళ్లు చేస్తున్న పనులు శృతిమించుతున్నాయి. నిన్నటికి నిన్న కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ రోడ్ నెంబర్ ఒకటిలో కొందరు యువకులు రోడ్లపై డబ్బులు చల్లుతూ వీడియోలు తీసిన ఘటన సంచలనంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ పరిధిలోని కూకట్ పల్లిలో కొందరు యువకులు రోడ్లపై పైసలు చల్లుతూ.. శునకానందం పొందారు.. ఎప్పుడూ రద్దీగా ఉంటే కేపీహెచ్ బీ రోడ్డు నంబ 1నడిరోడ్డు పై నిలబడి డబ్బులు ఆకాశంలోకి విసురుతూ.. రీల్స్ చేశారు.. ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేశారు. పైసలకోసం రోడ్లమీద జనాల ఎగబడటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 

వీడియోలో యూట్యూబర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.. ‘‘నేను గాల్లోకి విసిరిన 50వేలు కేవలం రెండు గంటల్లో సంపాదించాను.. మీరు కూడా నాతోపాటు జాయిన్ కండి.. కేవలం రోజుకు రెండు వేలు పెట్టండి.. మీకు ఐదు నుంచి 20వేల వరకు సంపాదన చూపిస్తానంటూ..యూబ్యూటర్ చెప్పడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రీల్స్ కోసం ఇలాంటి వికృత చేష్టలు చేస్తున్నవారిపై.. చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు.