మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాంట్రాక్టర్లను బెదిరించి..ఆ పనులను వేరే వారికి అమ్ముకున్నారని కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వర్ రావు ఆరోపించారు. మంత్రి ప్రతీ దాంట్లో కమీషన్లు దండుకున్నారని విమర్శించారు. ప్రజల భూములు కబ్జా చేసి కాలేజ్ చుట్టూ పెన్సింగ్ వేసి ఎవర్నీ రానియ్యడం లేదన్నారు తమ్మల. ఖమ్మంలో అంతా దోచుకునే ముఠాను తయారు చేశారన్నారు. తాను గెలిస్తే అరాచకాలు ఉండవు.. దోపిడి ఉండదన్నారు.
వ్యవసాయ మార్కెట్ ను తమ హయాంలో అభివృద్ధిచేశామన్నారు తుమ్మల. ఒకప్పుడు మార్కెట్ కు సరైన దారి కూడా ఉండేది కాదన్నారు. ఖమ్మం గుట్టలను మాయం చేసి మట్టి దోచుకున్నారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే మోడల్ మార్కెట్ చేస్తానని చెప్పారు. మార్కెట్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తానని తెలిపారు.