పువ్వాడ అజయ్ అఫిడవిట్లో తప్పులు.. నామినేషన్ తిరస్కరించండి:తుమ్మల

బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పువ్వాడ అజేయ్ కుమార్ సమర్పించిన అఫిడవిట్లో తప్పులు ఉన్నాయని.. ఆయన నామినేషన్ ను తిరస్కరించాలని కోరుతూ కాంగ్రెస్ అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం రిటర్నింగ్ ఆఫీసర్ కు పిర్యాదు చేశారు. 2023, నవంబర్ 13వ తేదీ సోమవారం ఖమ్మం ఆర్డీఓ ఆఫీస్ కు తుమ్మల వెళ్లి.. పువ్వాడ అజేయ్ సమర్పించిన 
నామినేషన్, ఎన్నికల సంఘం ఫార్మాట్ కు భిన్నంగా ఉందంటూ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

బీఅర్ఎస్ అభ్యర్థి పువ్వాడ ఆఫిడవిట్ ప్రిస్క్రైబ్ ఫార్మాట్ లో లేదని...ఫార్మాట్ మార్చడంపై రిటర్నింగ్ అధికారికి పిర్యాదు చేశానని చెప్పారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఫార్మాట్ లో కాకుండా  పువ్వాడ అజయ్ మార్చి ఇచ్చారని ఆరోపించారు. దాంతోపాటు అఫిడవిట్ లో డిపెండెంట్ కాలమ్ మార్చారని అన్నారు. డిపెండెంట్ కాలమ్ లో ఎవ్వరు లేకపోతే నిల్ అని రాయకుండా మార్చారని.. నాలుగు సెట్స్ నామినేషన్లు కూడా తప్పులుగా ఉన్నాయని ఆయన చెప్పారు. 

ప్రిస్క్రైబ్ ఫార్మాట్లో లేకపోతే నామినేషన్ రిజెక్ట్ చేయాలని రిటర్నింగ్ అధికారిని అడిగానని తెలిపారు.రిటర్నింగ్ అధికారి ఎన్నికల నిబంధనలు పాటించలేదని.. ఆర్ఓపై ఎన్నికల సంఘనికి  పిర్యాదు చేస్తానని.. అవసరమైతే న్యాయ స్థానంలో కూడా పోరాటం చేస్తానని తుమ్మల అన్నారు.