ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలి : తుమ్మేటి సమ్మిరెడ్డి

జమ్మికుంట, వెలుగు : మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర పోలీస్ అధికారులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు, మార్కెట్ కమిటీ మాజీ  చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి అధికారులను కోరారు. జమ్మికుంటలోని తన నివాసంలో సమ్మిరెడ్డి విలేకరుల సమావేశంలో  మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హుజురాబాద్ నియోజకవర్గం చాలా ప్రశాంతంగా ఉందన్నారు. 

ప్రశాంత వాతావరణం చూసి తట్టుకోలేని కౌశిక్ రెడ్డి అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్​ హయాంలో కౌశిక్ రెడ్డి అనేకమంది నాయకులు, కార్యకర్తలను చిత్రహింసలకు గురిచేశాడని తెలిపారు. పోలీస్ అధికారులు, మంత్రి పొన్నం ప్రభాకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. కౌశిక్​రెడ్డిపై వెంటనే పోలీసు అధికారులు చట్టపరమైన చర్యలు తీసు కోవాలని కోరారు.