
- సిద్ధిపేట జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
- ఖమ్మం జిల్లాలో మరో రైతు మృతి
- నేలరాలిన వరి, మామిడి, మొక్కజొన్న
- విరిగిన కరెంట్ స్తంభాలు, చెట్లు… పలు గ్రామాల్లో అంధకారం
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బలమైన గాలులు, వడగళ్ల వాన బీభత్సం సృష్టించాయి. ఖమ్మం జిల్లాలో వడగళ్ల వాన పడింది. సిద్ధిపేట, నల్గొండ, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన రాళ్ల వాన పడింది. వరి, మామిడి, మొక్కజొన్న పంటలకు తీవ్రనష్టం కలిగింది.
సిద్ధిపేట జిల్లా : హుస్నాబాద్, అక్కన్నపేట, కొహెడ మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వాన ఈ సాయంత్రం బీభత్సం సృష్టించింది. వాన బీభత్సానికి మామిడి తోటలు, వరి పంటలకు తీవ్ర నష్టం కలిగింది. మార్కెట్ యార్డుల్లో వరిధాన్యం తడిసి ముద్దయింది. రోడ్లపై చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. పలు గ్రామాల్లో కరెంట్ లేక అంధకారం ఏర్పడింది. అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో మహేందర్ రెడ్డి అనే రైతు పిడుగుపాటుకు మృతి చెందాడు. వడగండ్ల వాన తీవ్ర నష్టం కలిగించిందనీ.. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరారు.