హైస్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ కోసం ఇంటెల్ థండర్‌బోల్ట్ 5 పేరుతో ఎక్స్టెర్నల్ కనెక్టర్‌ను లాంచ్ చేసింది. కంటెంట్ క్రియేటర్లు, గేమర్లకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ కేబుల్ 80 జీబీపీఎస్స్పీడ్తో డేటాను బదిలీ చేస్తుంది. అంతేగాక 120 జీబీపీఎస్ బ్యాండ్‌విడ్త్‌ను ఇస్తుంది. మూడేళ్ల క్రితం తీసుకొచ్చిన థండర్‌బోల్ట్ 4 కంటే మూడు రెట్లు ఎక్కువ స్పీడ్‌తో పనిచేస్తుంది. ఒకేసారి రెండు 8కే డిస్‌ప్లేలను కనెక్ట్ చేయవచ్చు.
ALSO READ: కిక్స్ స్మార్ట్ బైక్ స్టేషన్ ప్రారంభం