
హైదరాబాద్, వెలుగు: ఈవీ చార్జింగ్ ప్రొవైడర్ థండర్ప్లస్ హైదరాబాద్‌లో భారతదేశపు తొలి మహిళా ఈవీ ఫాస్ట్ చార్జర్ ఫ్రాంచైజీని ప్రారంభించింది. ఈ కార్యక్రమం వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈవీ ఛార్జింగ్ రంగంలో కొత్త వ్యాపార అవకాశాలను అందిస్తోందని పేర్కొంది.
ఒక ప్యాకేజీగా దీనిని అందిస్తున్నామని తెలిపింది. ఇందులోనే 30 కిలోవాట్ల డీసీ 4-వీలర్ చార్జర్, టెక్నాలజీ సౌకర్యం, ఇన్స్టలేషన్, బ్రాండింగ్, షెడ్డు, వ్యాపారాభివృద్ధికి మద్దతు వంటి సదుపాయాలు ఉంటాయి. రూ. ఆరు లక్షల పెట్టుబడితో మూడు సంవత్సరాల్లో రూ. 12 లక్షల ఆదాయం పొందవచ్చని థండర్ప్లస్ ప్రకటించింది.