
తూప్రాన్, వెలుగు : గజ్వేల్ లో ఈ సారి కాంగ్రెస్ గెలవడం ఖాయమని గజ్వేల్ కాంగ్రెస్ అభ్యర్థి తూంకుంట నర్సారెడ్డి, రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డి అన్నారు. బుధవారం తూప్రాన్ మున్సిపాలిటీలోని లింగారెడ్డి ఫంక్షన్ హాల్లో ఉమ్మడి మండల కాంగ్రెస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కాంగ్రెస్ ఇచ్చిన భూములను కబ్జాలు పెట్టి ఫాంహౌస్ లు కట్టుకునే నాయకుడు అవసరమా అన్నారు.
గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పారు. ఐదేండ్లకు ఒకసారి ప్రజల వద్దకు వచ్చి మాయమాటలు చెప్పే బీఆర్ఎస్, బీజేపీ నాయకులను నమ్మొద్దని సూచించారు. కార్యక్రమంలో తూప్రాన్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, పల్లెర్ల రవీందర్, మున్సిపల్ కౌన్సిలర్ భగవాన్ రెడ్డి తదితరులునన్నారు.