గణేష్ నిమజ్జనం సందర్భంగా గురువారం(సెప్టెంబర్ 28) హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో సెలవు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. వీటితో పాటు మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాలకు కూడా ఈ సెలవు వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్కూళ్లు, కాలేజీలు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవు ఇచ్చారు.
గణేష్ నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ తెలిపారు. 21వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏపీతో పాటు కేంద్ర బలగాలను కూడా రంగంలోకి దింపారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, రైల్వే పోలీస్ ఫోర్స్‌తో నిఘా పెట్టారు. నవరాత్రుల పూజలందుకున్న లంబోదరుడికి జనాలు బై.. బై.. చెబుతున్నారు. . నిమజ్జనానికి తెలంగాణ పోలీస్ శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంది. ముఖ్యంగా శోభాయాత్ర జరిగే రూట్ పై ప్రధానంగా దృష్టి పెట్టారు.
- ALSO READ | పీవోపీ గణేష్ విగ్రహాల నిమజ్జనంపై సర్వత్రా ఉత్కంఠ