ముగిసిన త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవం

ముగిసిన త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవం
  • వేడుకలకు హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ

మాదాపూర్, వెలుగు: మాదాపూర్ శిల్పారామంలో ఐదు రోజుల పాటు నిర్వహించిన హైదరాబాద్ త్యాగరాజ ఆరాధనా సంగీతోత్సవం ఆదివారం ముగిసింది. ఐదో రోజు త్యాగరాజ స్వామికి స్మృత్యంజలి పేరిట కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రసిద్ధ కర్నాటక వాయులీన విద్వాంసులు, నాద సుధార్ణవ, పద్మశ్రీ డా. అన్నవరపు రామస్వామిని గురు సన్మానంతో గౌరవించుకున్నారు. 

ఈ కార్యక్రమనికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశవిదేశాల నుంచి తరలివచ్చిన 600 మందికి పైగా సంగీతకారులు కలిసికట్టుగా త్యాగరాజ స్వామి ఘనరాగ పంచరత్న కీర్తనలని ఆలపించారు. సాయంత్రం షణ్ముఖప్రియ, హరిప్రియల గాత్రం పరిసరాలను భక్తిభావంతో ప్రతిధ్వనింపజేసింది. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక సంచాలకులు, మామిడి హరికృష్ణ,  తదితరులు పాల్గొన్నారు.