హైదరాబాద్ సిటీకి చేరుకున్న టిబెట్ విముక్తి బైక్​ ర్యాలీ

హైదరాబాద్ సిటీకి చేరుకున్న టిబెట్ విముక్తి బైక్​ ర్యాలీ

సికింద్రాబాద్, వెలుగు: చైనా నుంచి టిబెట్ కు విముక్తి కల్పించాలని కోరుతూ, 60 ఏండ్లుగా టిబెట్ కు భారత్​ చేస్తున్న సహాయానికి కృతజ్ఞతగా టిబెట్ యూత్ కాంగ్రెస్ నాయకులు చేపట్టిన బైక్ ​ర్యాలీ సిటీకి చేరుకుంది. 26 రోజుల కింద అరుణాచల్ ప్రదేశ్ లోని బార్డర్​నుంచి మొదలైన బైక్ ర్యాలీ గురువారం తెలంగాణకు చేరుకుందని టీవైసీ ప్రెసిడెంట్ టామో గంపో తెలిపారు.

సికింద్రాబాద్ లో టిబెట్ యూత్ కాంగ్రెస్ నాయకులకు ప్రముఖ మెజీషియన్, ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్, నేషనల్ యూత్ అవార్డు గ్రహీత సామల వేణు స్వాగతం పలికారు. వారి బైక్​ర్యాలీకి సంఘీభావం తెలిపి సన్మానించారు. 15 మంది టిబెట్​యూత్​కాంగ్రెస్​నాయకులు ఇండియాలోని 19 రాష్ట్రాల్లో ర్యాలీ నిర్వహించడం అభినందనీయమన్నారు. దాదాపు 20 వేల కిలో మీటర్లు బైకులపై తిరగడం వారి సాహసానికి నిదర్శనమన్నారు. కాగా అరుణాచల్ ప్రదేశ్ లో మొదలైన బైక్​ర్యాలీ అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్, ఛత్తీస్ గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మీదుగా  తెలంగాణకు చేరుకుంది. ఇక్కడి నుంచి కర్ణాటక వైపు వెళ్లింది.