హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్ హర్మనీ ప్లాజాలో టీఐసీ అకాడమీని ది ఇన్వెస్టర్ కో (టీఐసీ) ఏర్పాటు చేసింది. దీనిని సంస్థ ఫౌండర్లు రక్షత్ గోయెల్, టీఐసీ మాస్టర్ ఫ్రాంచైజి నిర్వాహకులు విశ్వనాథ్ సామా, అకాడమీ ప్రాంచైజి నిర్వాహకులు సంజయ్ దోల్వానీ ఆదివారం ప్రారంభించారు. ఈ అకాడమీలో స్టాక్ మార్కెట్, ట్రేడింగ్ గురించి నేర్పుతారు.
అందరికీ ఫైనాన్షియల్ మార్కెట్ ట్రేడింగ్ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో టీఐసీ అకాడమీని మొదలు పెట్టామని టీఐసీ ఓ స్టేట్‌మెంట్‌లో పేర్కొంది. ఇక్కడ ట్రేడింగ్ నేర్చుకోవచ్చని, ప్రాక్టిస్ చేయొచ్చని, సంపాదించుకోవచ్చని తెలిపింది. తమ సొంత క్యాపిటల్‌తోనే ట్రేడింగ్‌పై శిక్షణ ఇస్తామని పేర్కొంది. ఫైనాన్షియల్ మార్కెట్‌లో ప్రతి వ్యక్తికి నాలెడ్జ్, స్కిల్స్, మార్కెట్ ఎలా పనిచేస్తుందో క్లియర్‌గా తెలిసి ఉండాలని టీఐసీ వివరించింది.